: కేసీఆర్ బయోపిక్ లో.. హీరోగా బాలీవుడ్ నటుడు!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. మధుర శ్రీధర్ దర్శకత్వంలో 'పెళ్లిచూపులు' నిర్మాత రాజ్ కందుకూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నారు. అయితే, కేసీఆర్ పాత్రను ఎవరు పోషిస్తారో అనే కుతూహలం అందర్లో నెలకొంది. ఈ సస్పెన్స్ కు దర్శకనిర్మాతలు తెరదించారు. బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు ఈ సినిమాలో కేసీఆర్ పాత్రను పోషించబోతున్నాడని రాజ్ కందుకూరి వెల్లడించారు.

క్వీన్, అలీగఢ్, కాయ్ పో యే తదితర సినిమాలతో రాజ్ కుమార్ రావు మంచి పేరు తెచ్చుకున్నారు. శ్రుతిహాసన్ జంటగా అతను నటించిన 'బెహెన్ హోగీ తేరి' సినిమా త్వరలోనే విడుదలకానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పూర్తయింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జూన్ 2వ తేదీన సినిమాను విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. 

More Telugu News