: దాసరి హీరో... ఆయన గురించి మాట్లాడడం అంటే తెలుగు సినీ పరిశ్రమ గురించి మాట్లాడడమే!: ఎంపీ కేకే

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆకస్మిక మృతితో గొప్ప హీరోను కోల్పోయామని ఎంపీ కె.కేశవరావు తెలిపారు. హైదరాబాదులోని దాసరి నివాసంలో ఆయన పార్థివదేహాన్ని సందర్శించేందుకు వచ్చిన కేకే మాట్లాడుతూ, దాసరి రియల్ హీరో అన్నారు. దాసరి గురించి మాట్లాడడం అంటే తెలుగు సినీ పరిశ్రమ గురించి మాట్లాడడమే అని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో దాసరి ప్రత్యేక పేజీ అని ఆయన చెప్పారు. తాను పీసీసీ చీఫ్ గా ఉండగా, ఆయన సహాయసహకారాలు అందించారని చెప్పారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన తమతో ఎంతో సన్నిహితంగా గడిపేవారని అన్నారు. ఎంతో మందికి ఆయన మార్గదర్శి అని ఆయన తెలిపారు. సినీ పరిశ్రమతో పాటు రాజకీయ రంగంలో కూడా ఆయన తనదైన ముద్ర వేశారని తెలిపారు.

More Telugu News