: కేరళను తాకిన నైరుతి పవనాలు... తడిసి ముద్దవుతున్న 'గాడ్స్ ఓన్ కంట్రీ'

నైరుతి రుతుపవనాలు మంగళవారం నాడు కేరళను తాకాయి. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో ఓ వైపు ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించినప్పటికీ, మరోవైపు ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. సాధారణంగా జూన్ 1వ తేదీకి నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతుంటాయి. ఈ సీజన్ లో మాత్రం రెండు రోజుల ముందుగానే రుతుపవనాలు వచ్చేశాయని భారత వాతావరణ శాఖ విభాగం డైరెక్టర్ జనరల్ కేజే రమేష్ వెల్లడించారు. మోరా తుపాను కారణంగానే నైరుతి రుతుపవనాలు ముందుగానే దేశాన్ని తాకాయని ఆయన తెలిపారు. కాగా, రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను మరో నాలుగైదు రోజుల్లో తాకవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

More Telugu News