: మధుర హత్యల ఎఫెక్ట్!.. 18-30 ఏళ్ల మధ్య యువకులు మొహం కనబడకుండా స్కార్ఫ్ చుట్టుకోవడంపై నిషేధం!

యువకులు తమ మొహం కనిపించకుండా స్కార్ఫ్‌లు గట్రా చుట్టుకోకుండా చూడాలంటూ ఆగ్రా డివిజనల్ కమిషనర్ కె.రామ్మోహన్ రావు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఎంత ఎండగా ఉన్నా సరే తమ మొహాన్నికవర్ చేసుకోకుండా చూడాలని సూచించారు. అలాగే, బైక్ మీద వెళుతున్నప్పుడు తప్ప, నడిచి వెళుతున్నప్పుడు హెల్మెట్ ధరించకుండా చూడాలంటూ ఆదేశించారు. ఈ విషయంలో మహిళలకు మినహాయింపు ఇచ్చారు. ఇటీవల మధుర-బృందావన్ ప్రాంతంలో రెండు బంగారం షోరూముల్లోకి చొరబడిన దోపిడీ దొంగలు ఇద్దరిని చంపి షోరూమ్‌ను దోచుకెళ్లారు.

ఈ నేపథ్యంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. ముఖం కనిపించకుండా తలకు ఏదో ఒకటి చుట్టుకుని దొంగతనాలకు పాల్పడుతున్నవారే ఎక్కువ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రామ్మోహన్ రావు తెలిపారు. అయితే ఇదేమీ తుగ్లక్ నిర్ణయం కాదన్నారు. సాధారణంగా 18-30 ఏళ్ల మధ్య ఉన్నవారే దోపిడీలకు పాల్పడుతున్నారని, కాబట్టి ముఖం కనబడకుండా జాగ్రత్త పడుతున్న వారిపై ఓ కన్నేసి ఉంచాలని పోలీసులకు సూచించినట్టు తెలిపారు.

More Telugu News