: బంగ్లాదేశ్ వైపు వెళ్లిపోయిన 'మోరా' తుపాను!

బంగాళాఖాతంలో ఏర్పడిన 'మోరా' తుపాను ఈ ఉదయం బంగ్లాదేశ్ వద్ద తీరాన్ని దాటేసింది. నాలుగైదు రోజుల క్రితం అల్పపీడనంగా ఏర్పడి, ఆపై అది వాయుగుండంగా మారగా, తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసిన సంగతి తెలిసిందే. వాయుగుండం తుపానుగా మారి తన దిశను మార్చుకుని బంగ్లాదేశ్ వైపు కదిలి, ఈ ఉదయం చిట్టగాంగ్ వద్ద తీరం దాటింది. గంటకు 117 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండగా, ముందు జాగ్రత్త చర్యగా వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన బంగ్లాదేశ్ అధికారులు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీములను సిద్ధం చేశారు.  

More Telugu News