: గోధుమ రంగు పామును మింగేసి, వాంతి చేసుకున్న నల్లపాము... వీడియో చూడండి

సాధారణంగా పాములు కప్పలు, కీటకాలను పట్టుకుని మింగేస్తాయి. అయితే, పెద్దదైన నల్లటి పాము గోధుమరంగులో ఉన్న మరో పెద్ద పామును మింగేసి, దానిని జీర్ణించుకోలేక తిరిగి వాంతి చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. క్రిస్టినోఫర్ రెనాల్డ్ అనే వ్యక్తి గగుర్పాటుకు గురిచేసే ఈ దృశ్యాన్ని వీడియో తీసి పోస్టు చేశారు. ఒళ్లు జలదరించే ఈ వీడియోను సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తిగా చూస్తున్నారు.

సాధారణంగా పాము ఆహారం తీసుకున్న తరువాత మెలితిరుగుతుంది. లేదా ఏదైనా చెట్టువంటిదానిని చుట్టుకుంటుంది. అయితే ఇక్కడ తాను మింగిన పాము కూడా పెద్దది కావడంతో దానిని పూర్తిగా మింగడం దాని వల్ల కాలేదు. దీంతో పెద్ద పాము దానిని వాంతి చేసుకోగా, బయటపడ్డ పాము సజీవంగానే వుండడం విశేషం. ఈ వీడియో మీరు కూడా చూడండి.

More Telugu News