: మాంచెస్టర్ ఉగ్రదాడితో సంబంధం ఉన్న ట్రైనీ పైలట్ అరెస్టు

ఇంగ్లండ్ లోని మాంచెస్టర్‌ లోని మెన్ ఎరీనాలో అరియానా గ్రాండేలో పాప్ షో సందర్భంగా జరిగిన ఉగ్రదాడితో సంబంధం ఉన్న ట్రైనీ పైలట్‌ ను భద్రతాధికారులు అదుపులోకి తీసుకున్నారు. లిబియాలో జన్మించిన 23 ఏళ్ల ట్రైనీ పైలట్‌ ను ఉగ్రదాడికి సహకరించాడని పేర్కొంటూ సస్సెక్స్‌ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ ఘటనతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్టు చేసినట్టైందని అధికారులు తెలిపారు.

ఈ ఘటనలో ఇప్పటి వరకు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, వారం క్రితం జరిగిన ఉగ్రదాడిలో 22 మంది మృత్యువాతపడగా, 54 మంది తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ దాడి అనంతరం మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో బ్రిటన్ మొత్తం బందోబస్తు పెంచారు. కాగా, ఈ దాడికి పాల్పడింది తామేనని ఐఎస్ఐఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

More Telugu News