: చౌక ధరలకే బీఫ్‌ లభించేలా ఏర్పాట్లు చేస్తాం: మేఘాలయ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం దేశ వ్యాప్తంగా ప‌శువుల అమ్మకాల‌పై ఆంక్ష‌లు విధించిన విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో గోమాంస నిషేధాన్ని స‌మ‌ర్థిస్తూ భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌లు వ్యాఖ్య‌లు చేస్తుండ‌గా, మరోవైపు మేఘాలయ బీజేపీ నేత బెర్నార్డ్‌ మారక్ మాత్రం అందుకు భిన్నంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే చౌక ధరలకే బీఫ్ అందిస్తామ‌ని చెప్పారు. కబేళాలను కూడా చట్టబద్ధం చేస్తామని అన్నారు. మేఘాలయలో బీఫ్ తినే బీజేపీ నేతలు ఎంతో మంది ఉన్నార‌ని, త‌మ‌ రాష్ట్రంలో బీఫ్ నిషేధం అనే ప్రశ్నే లేద‌ని అన్నారు. రాజ్యాంగ పరంగా త‌మ‌ రాష్ట్రానికి వర్తించే అంశాలపై కూడా త‌మ నేత‌ల‌కు ఎంతో అవ‌గాహ‌న‌ ఉందని అన్నారు. ప్ర‌స్తుతం త‌మ రాష్ట్రంలో బీఫ్‌ బాగా ఖరీదైన పదార్థంగా మారిందని, వ‌చ్చే ఎన్నిక‌ల త‌రువాత అధికారంలోకి వ‌చ్చి ధరలను తగ్గిస్తామ‌ని తెలిపారు.                     

More Telugu News