: ప్రియాంక చోప్రాకు దాదాసాహెబ్ ఫాల్కే అకాడమీ అవార్డు!

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా దాదాసాహెబ్ ఫాల్కే అకాడమీ అవార్డుకు ఎంపికైంది. హాలీవుడ్ లో సైతం అడుగుపెట్టి, క్వాంటికో, బేవాచ్ లతో అంతర్జాతీయ గుర్తింపును పొందినందుకు ప్రియాంకకు ఈ అవార్డును ఇవ్వనున్నారు. ఈ ఏడాదే కొత్తగా ప్రవేశపెడుతున్న 'అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నటి' విభాగంలో ఆమెను ఈ పురస్కారంతో సత్కరించనున్నారు. ఈ నేపథ్యంలో, ఈ అవార్డును పొందుతున్న తొలి నటిగా ప్రియాంక చోప్రా రికార్డులకు ఎక్కబోతోంది. జూన్ 1న ఈ అవార్డును ప్రియాంకకు ఇవ్వనున్నారు. మరోవైపు, ప్రియంక తల్లి మధు చోప్రా కూడా ఓ అవార్డును అందుకోబోతోంది. ఆమె నిర్మాతగా వ్యవహరించిన 'వెంటిలేటర్' అనే సినిమాకు గాను... ఉత్తమ తొలి చిత్రం అవార్డుకు ఆమె ఎంపికయ్యారు.

More Telugu News