: పశువధపై నిషేధం విధించిన తర్వాత 'బీఫ్ ఫెస్ట్' చేసుకున్న ఐఐటీ మద్రాస్ విద్యార్థులు

పశువధపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడం పట్ల మద్రాస్ ఐఐటీలోని ఓ వర్గం విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. పశువధ నిషేధంపై ఓ చర్చా కార్యక్రమాన్ని వీరు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఫ్ ఫెస్టివల్ ను చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 80 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి నేత మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజలపై మత పరమైన ఆంక్షలను విధించడం కిందకే వస్తుందని అన్నారు.

మరోపక్క, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ అయినప్పటికీ... తమిళనాడులోని పళనిస్వామి ప్రభుత్వం ఇంతవరకు పశువధపై నిషేధం విధించలేదు. ఈ సందర్భంగా పళనిస్వామి మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డర్ ను పూర్తిగా చదివిన తర్వాతనే తాను దీనిపై స్పందిస్తానని చెప్పారు. కేరళలో కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తాము ఆమోదించబోమని కేరళలోని సీపీఎం ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు వెలువడిన తర్వాత సీపీఎం ఆధ్వర్యంలో 300కి పైగా బీఫ్ ఫెస్టివల్స్ జరిగాయి. ఈ కార్యక్రమాల్లో గొడ్డు మాంసాన్ని వండి... ఫ్రీగా సర్వ్ చేశారు.

More Telugu News