: గోమాంస నిషేధంపై భగ్గుమంటున్న కేరళ, పశ్చిమ బెంగాల్‌

ఆవులు స‌హా ఎద్దులు, బ‌ర్రెలు, ఒంటెలు వంటి పశువుల‌ వధపై నిషేధం విధిస్తూ ఇటీవ‌లే న‌రేంద్ర మోదీ స‌ర్కారు ప‌లు నిబంధ‌న‌ల‌ను జారీచేసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై కేరళ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం సమాఖ్య స్ఫూర్తిని మంటకలుపుతోందని, అటువంటి నిబంధ‌న‌ల‌ను పెట్టే హ‌క్కు రాష్ట్రాల‌కు మాత్ర‌మే ఉంటుంద‌ని ఆయా రాష్ట్రాల్లోని ప‌లు ప్ర‌జా సంఘాలు మండిప‌డుతున్నాయి.

అయితే, దీనిపై స్పందించిన‌ కేంద్ర పర్యావరణ శాఖ... తాము ప‌శువుల‌ను హతమార్చడాన్ని నిషేధించలేదని, జంతువులను హింస నుంచి రక్షించే చట్టం కిందనే ప‌లు నిబంధ‌న‌లు తీసుకొచ్చామని స్ప‌ష్టం చేసింది. తాము సమైక్య స్ఫూర్తిని దెబ్బతీయలేదని వ్యాఖ్యానించింది. ప్రివెన్షన్‌ ఆఫ్‌ క్రూయాలిటీ టువర్డ్స్ యానిమల్స్‌ యాక్ట్ లోని 11వ సెక్షన్‌ (ఈ) నిబంధన.. అనవసరంగా హింసించనంత కాలం ఆహారం కోసం జంతువులను చంపవ‌చ్చ‌ని చెబుతోంద‌ని కేర‌ళ‌, ప‌శ్చిమ బెంగాల్ లోని ప‌లువురు నేత‌లు వాదిస్తున్నారు. దేశవ్యాప్తంగా గోమాంసం నిషేధించాలనే ఆర్ఎస్ఎస్‌ డిమాండ్ ప్ర‌కార‌మే కేంద్ర స‌ర్కారు ఇటువంటి నిబంధ‌న‌లు తీసుకొచ్చింద‌ని మండిప‌డుతున్నారు. 

More Telugu News