: ఇప్పుడు సల్మాన్ కానీ....అప్పట్లో అతనే బాగుండేవాడు!: మనీషా కొయిరాలా

బాలీవుడ్ లో హాట్ హీరో ఎవరంటే సల్మాన్ ఖాన్ అని అంతా సమాధానమిస్తారు. బాలీవుడ్ లో సల్మాన్ అందగాడని పలు మేగజీన్ లు కూడా పేర్కొన్నాయి. అలాగే ప్రపంచంలోని అందమైన నటుల్లో సల్మాన్ ఒకడని అంతర్జాతీయ మేగజీన్ ఒకటి గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేపాలీ భామ, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మనీషా కొయిరాలాను ఒక ప్రమోషన్ ఈవెంట్ లో బాలీవుడ్ లో ఏ హీరో హాటెస్ట్ హీరో అని అడిగింది. దానికి 'ఇప్పుడంతా సల్మాన్ ఖాన్ అని అంటున్నారు కానీ, అప్పట్లో హాటెస్ట్ హీరో అంటే 'జాకీ ష్రాఫ్' అంటూ తన అభిమానాన్ని చాటుకుంది. కాగా, మనీష్ కొయిరాలా జాకీతో పాటు సల్మాన్ తో కూడా చాలా సినిమాల్లో నటించింది.

More Telugu News