: విషాదంలో కూడా న్యూజిలాండ్ తో వార్మప్ మ్యాచ్ ఆడి ఆకట్టుకున్న అశ్విన్

టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహకాల్లో భాగంగా న్యూజిలాండ్ తో ఆడిన మ్యాచ్ లో బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లిన అశ్విన్ కు న్యూజిలాండ్ తో మ్యాచ్ కు ముందు తనకు ఎంతో ఇష్టమైన తన తాతగారు ఇకలేరని తెలిసింది. ఈ విషయాన్ని తొలి వార్మప్ మ్యాచ్ కు ముందు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో బాధతోనే బరిలో దిగిన అశ్విన్ 6 ఓవర్లు బౌలింగ్ చేసి, ఒక వికెట్ తీశాడు.

గాయం కారణంగా ఐపీఎల్ కు దూరంగా ఉన్న అశ్విన్, దాని నుంచి కోలుకుని, ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు ఇంగ్లండ్ జట్టుతో వచ్చాడు. అయితే అశ్విన్ ఇంగ్లండ్ చేరుకున్న అనంతరం వయసు పైబడడంతో అనారోగ్య కారణాల వల్ల అశ్విన్‌ తాత ఎస్‌.నారాయణసామి(92) తుదిశ్వాస విడిచారు. సంప్రదాయ పద్ధతుల్లో ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు పూర్తి చేసినట్టు అశ్విన్ కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న అశ్విన్ విషాదంలో కూడా ఆడి ఆకట్టుకున్నాడు. కాగా, అశ్విన్ ఆటగాడిగా ఎదగడం వెనుక నారాయణసామి పాత్ర విశేషమైనదని అశ్విన్ తండ్రి రవిచంద్రన్ తెలిపారు.

More Telugu News