: తగ్గిన ఉష్ణోగ్రతలు...తెలుగు రాష్ట్రాలు ఫుల్ ఖుష్

గత రెండు రోజులుగా ఎండలు తగ్గాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. నిన్నటి వరకు నడి రోడ్డుపైకి వస్తే బెంబేలెత్తించిన మండే సూర్యుడు గత రెండు రోజులుగా అప్పుడప్పుడు కనిపిస్తుండడంతో ఎండల తీవ్రత తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. ఈ నేపథ్యంలో రేపు కేరళను ఈశాన్య రుతుపవనాలు తాకనున్నాయన్న వాతావరణ శాఖ చెప్పిన వార్త ఆనందాన్ని తెచ్చింది. అయితే విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో వాయుగుండం ఏర్పడిందని తెలిపింది.

ఇది మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తీవ్రరూపం దాల్చిందని, సాయంత్రానికి కోల్‌ కతాకు దక్షిణ ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో, బంగ్లాదేశ్‌ లోని చిట్టగాంగ్‌ కు దక్షిణ నైరుతి దిశగా 740 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. ఇది రానున్న 24 గంటల్లో తుపానుగా మారనుందని, అనంతరం 30న మధ్యాహ్నానికి బంగ్లాదేశ్‌ తీరాన్ని తాకుతుందని వారు వెల్లడించారు. దీని ప్రభావంతో ఉత్తరకోస్తాలో 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని విశాఖ వాతావరణ శాఖాధికారులు తెలిపారు.

More Telugu News