: మహేశ్ బాబు అభిమానులకు మరోసారి నిరాశ!

సినీ న‌టుడు మహేశ్ బాబు అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ నెల 31వ తేదీన మ‌హేశ్ న‌టిస్తున్న స్పైడ‌ర్ టీజ‌ర్‌ విడుద‌లవుతుంద‌ని అభిమానులు భావించారు. అయితే, ఆ సినిమా దర్శకుడు మురుగదాస్ మాత్రం ఈ టీజర్ ను రిలీజ్ చేయాల‌ని అనుకోవ‌డం లేద‌ట‌. గ‌త ఆరేళ్లుగా మహేశ్‌ బాబు త‌న లేటెస్ట్ సినిమా టీజర్ లేదా ఫస్ట్ లుక్ ను కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేస్తూ వ‌స్తున్నాడు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను హడావిడిగా కట్ చేసి విడుద‌ల‌ చేస్తే లాభం కన్నా నష్టమే అధిక‌మ‌ని మురుగదాస్ భావిస్తున్నాడు. దీంతో టీజర్ రిలీజ్ కు మ‌రింత స‌మ‌యం ప‌డుతుంద‌ని చెప్పాడు. అభిమానులు మాత్రం ఈ సినిమా టీజ‌ర్‌ను ఈ నెల 31న విడుద‌ల చేయాల్సిందేన‌ని కోరుతున్నారు.                     

More Telugu News