: హైదరాబాద్ టు శ్రీశైలం రైలు ప్రాజెక్టుకు మంగళం... లాభం రాదని తేల్చిన రైల్వే బోర్డు

హైదరాబాద్ నుంచి శ్రీశైలం (అచ్చంపేట) వరకూ రైల్వే శాఖ ప్రతిపాదించిన 171 కిలోమీటర్ల నూతన రైలు మార్గం లాభసాటి కాదని తేల్చిన రైల్వే బోర్డు, ఈ ప్రాజెక్టును విరమించుకోవాలని నిర్ణయం తీసుకుంది. కేవలం బస్సు మార్గమే తప్ప మరో మార్గం లేని శ్రీశైలం పట్టణానికి రైలు మార్గం వేయాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ వస్తుండగా, రూ. 1,307.14 కోట్లతో ప్రాజెక్టును చేపట్టవచ్చని రైల్వే శాఖ అంచనాలు రూపొందిస్తూ, సర్వే చేసింది.

ఆపై సరకు రవాణాకు అవకాశాలు లేకపోవడం, పెట్టిన పెట్టుబడికి తగ్గట్టు రాబడి వచ్చే అవకాశం లేదని, నష్టాలు తప్పవని రైల్వే బోర్డుకు నివేదిక అందింది. దీంతో ఈ ప్రాజెక్టును పక్కన బెట్టాలని బోర్డు నిర్ణయించగా, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త ప్రాజెక్టును చేపట్టాలని మల్లన్న భక్తులు కోరుతున్నారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం కల్పించుకుని, భాగస్వామ్యం కింద సగం ఖర్చును భరిస్తామని చెబితే తప్ప ఈ ప్రాజెక్టు ముందుకెళ్లే అవకాశాలు లేవని తెలుస్తోంది.

More Telugu News