: హైదరాబాద్‌లో పెరగనున్న పెట్రోలు, డీజిల్ ధరలు.. వైజాగ్‌లో పెరిగిన ధరలతో విక్రయం

హైదరాబాద్‌లో జూన్ 1 నుంచి పెట్రోలు ధరలు పెరగనున్నాయి. పెట్రోలు లీటరుకు రూ.2, డీజిల్ లీటరుకు రూ.1.50 చొప్పున పెరగనున్నాయి. రోజువారి ధరల సమీక్షలో భాగంగా చమురు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. గతంలో 15 రోజులకోమారు ఆయిలు ధరల సమీక్ష ఉండగా, ప్రస్తుతం రోజు వారీ సమీక్షిస్తున్నారు. మే 15న పెట్రోలు ధర లీటరకు రూ.2.94, డీజిల్‌కు రూ.2.66 తగ్గడంతో పెట్రోలు ధర రూ.69.74, డీజిల్ రూ.59.87కు చేరుకుంది. అలాగే విశాఖపట్టణంలో మే 15న లీటరు పెట్రోలు రూ.70.52కు విక్రయించగా, శనివారం నుంచే ధరలు పెరిగాయి. అక్కడ రూ.1.54 పెరగడంతో లీటరు పెట్రోలు ధర రూ.72.06కి చేరుకుంది. అలాగే మే 15న వైజాగ్‌లో రూ.60.57 ఉన్న డీజిల్ ధర ప్రస్తుతం రూ. 61.73కు చేరుకుంది.

More Telugu News