: నన్ను చెడ్డవాడిని చేయవద్దు... మరోసారి ఆ వీడియో చూడండి... ధోనీ నాకు మంచి మిత్రుడు: మీడియాకు హర్భజన్ విజ్ఞప్తి

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని అవమానించేలా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాట్లాడాడంటూ మీడియా కథనాలు వెల్లువెత్తడంతో సోషల్ మీడియాలో హర్భజన్ పై నెటిజన్లు ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. దీనిపై హర్భజన్ సింగ్ వివరణ ఇచ్చాడు. తాను చెప్పిన మాటలను మీడియా వక్రీకరించిందని అన్నాడు. మరోసారి మీడియా తాను మాట్లాడిన వీడియో చూడాలని సూచించాడు.

తాను ధోనీని ఎందుకు జట్టులోకి తీసుకున్నారని అడగలేదని స్పష్టం చేశాడు. ధోనీలా తనను కూడా జట్టులోకి తీసుకోవాల్సిందని అన్నానని మాత్రం చెప్పాడు. అంతే తప్ప ధోనీని కించపరచలేదని తెలిపాడు. అలాగే ధోనీ తనకు మంచి మిత్రుడు మాత్రమే కాదని, మంచి ఆటగాడు కూడా అని భజ్జీ చెప్పాడు. 19 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నానని, తనను కూడా సెలెక్టర్లు ఛాంపియన్స్ ట్రోఫీలో ఎంపిక చేసి ఉంటే బాగుండేదని చెప్పానని, సెలెక్టర్లు తన విషయంలో ఉదాసీనత ప్రదర్శించారని చెప్పానని భజ్జీ తెలిపాడు.

1/3 Dear media plz don't misquote all the time. Any1 who wants 2know what exactly I said in that interview please go & see the entire video. pic.twitter.com/aatVC4wxzM
— Harbhajan Turbanator (@harbhajan_singh) May 26, 2017

2/3 MSD is a dear friend &a great player, I never doubted his selection so please don't quote me on things which I never said against him
— Harbhajan Turbanator (@harbhajan_singh) May 26, 2017

3/3 just to run ur sites n create 'sensatiinonal stories' don't misquote & run out of context to harm someone elses image.
— Harbhajan Turbanator (@harbhajan_singh) May 26, 2017

More Telugu News