: ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతోనే ఉగ్రవాదిగా మారాడు.. చివరికి ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు!

జమ్మూకశ్మీర్‌ లో చాపకింద నీరులా యువతలో ఉగ్రవాదాన్ని వ్యాపింపజేస్తున్న ఉగ్రవాది, హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాది సబ్జార్ అహ్మద్ ను భద్రతా దళాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. బుర్హాన్ వానీ వారసుడిగా ఉగ్రవాదంలోకి ఎంటరైన సబ్జార్ అహ్మద్ వాస్తవానికి దక్షిణ కశ్మీర్ లోని రత్సునా గ్రామానికి చెందినవాడు. బుర్హాన్ వానీకి మంచి స్నేహితుడు. బుర్హాన్ వానీ ఉగ్రవాదిగా మారి బిజీగా ఉన్న సమయంలో సబ్జార్ ఒక యువతిని ప్రేమించాడు. వారి తల్లిదండ్రులను కూడా కలిశాడు.

ఆమెను ప్రేమిస్తున్నానని, ఆమెనే వివాహం చేసుకుంటానని వారిని కోరాడు. దీనికి ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు. అతనికి తన కుమార్తెను ఇవ్వడం ఇష్టం లేదని ఆ యువతి తండ్రి స్పష్టం చేశారు. దీంతో విరక్తి చెందిన సబ్జార్ ఉగ్రవాదంవైపు మళ్లాడు. టెర్రరిజంలో చేరేందుకు పోలీసుల నుంచి రైఫిల్ దొంగతనం చేసి, 2015 ఏప్రిల్ లో హిజ్బుల్ ముజాహిదీన్ లో జాయినయ్యాడు. బుర్హాన్ వానీ ఎన్ కౌంటర్ తరువాత సబ్ డాన్ గా పేరొందిన సబ్జార్...అండర్ గ్రౌండ్ లో ఉంటూనే సర్కిల్ ను వ్యాపింపజేసేవాడు. సోషల్ మీడియాకు దూరంగా గడిపేవాడు.

More Telugu News