: ‘మహానాడు’లో తెలంగాణ బోనాలు!

విశాఖపట్టణం వేదికగా ప్రారంభమైన టీడీపీ ‘మహానాడు’కు హాజరయ్యే వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. టీడీపీ కార్యకర్తలు వలంటీర్లుగా మారి తమ సేవలందిస్తున్నారు. మహానాడులో విశేషాల గురించి చెప్పాలంటే

* స్వచ్ఛందంగా సేవలు చేసేందుకు వచ్చిన కార్యకర్తలకు డ్రెస్ కోడ్. పురుషులకు పసుపు టీ షర్టులు, మెడలో ధరించేందుకు  ఆకుపచ్చటి రుమాలు.
* మహిళలకు పసుపు చీర, మెడలో ధరించేందుకు ఆకుపచ్చని రుమాలు
* భోజనశాలలు.. ఎ1, ఎ2, ఎ3గా ఏర్పాటు చేశారు. పదిహేను వేల మంది ఒకేసారి భోజనం చేయొచ్చు.
* సభాస్థలిపై ఓ పక్క హైటెక్ సిటీ, మరో పక్క పోలవరం ప్రాజెక్టు నమూనాలను తీర్చిదిద్దారు
* ఈ రోజు అరకు కళాకారులతో థింసా నృత్యం, శ్రీకాకుళం కళాకారులతో తప్పెటగుళ్లు, విజయనగరం కళాకారుల పులివేషాలు, బొబ్బిలి బిందెల డ్యాన్స్, కోలాటం, తూర్పుగోదావరి జిల్లా కళాకారుల డప్పు నృత్యం, విశాఖ జిల్లా కళాకారుల గరిడీ, ఎద్దు, గంగిరెద్దులు, తెలంగాణ బోనాలు, బతుకమ్మలు, పోతురాజులు, ఏలూరు కళాకారులతో అష్టలక్ష్మి నృత్యాలు ఉంటాయి.
* మహానాడులో రెండో రోజున.. చిందు యక్షగానం, పాటలు, బుర్రకథ, ఎన్టీఆర్ పాటల మిక్సింగ్ డ్యాన్స్..ఎన్టీఆర్ ఏకపాత్రాభినయం, ఆర్కెస్ట్రా తదితర కార్యక్రమాలు ఉంటాయి. మూడో రోజున కూడా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.

More Telugu News