: దేశంలో ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదు: అమిత్ షా

125 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలను కల్పించడం సాధ్యం కాదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. అందుకే ఎన్డీయే ప్రభుత్వం స్వయం ఉపాధివైపు యువతను ప్రోత్సహించే దిశగా పని చేస్తోందని చెప్పారు. మన దేశంలో ఇప్పటి వరకు మోదీ ప్రభుత్వం అంత పారదర్శకమైన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని చెప్పారు. మూడేళ్ల పాలనలో ఒక్క కుంభకోణం కూడా జరగలేదని గుర్తు చేశారు. కుటుంబ పాలన, కుల రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టామని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో అంతులేని అవినీతి ఉండేదని, వ్యవస్థ మొత్తం అచేతనావస్థలో ఉండేదని... కానీ మోదీ ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి లేదని, అవినీతికి సంబంధించి ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు.

More Telugu News