: కంచ ఐలయ్య గారు!, సింహం, పులి...మాంసం తినండి .. శక్తి బాగా వస్తుంది!: పరిపూర్ణానంద స్వామి

దేశంలో బీఫ్ ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఓ న్యూస్ ఛానెల్ నిర్వహించిన చర్చలో ప్రొఫెసర్ కంచ ఐలయ్య తప్పుబట్టారు. కాగా, ఇదే చర్చా కార్యక్రమంలో పరిపూర్ణానంద స్వామీజీ కూడా పాల్గొన్నారు. శాకాహారాన్ని బీజేపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్న ఐలయ్య వ్యాఖ్యలకు స్వామీజీ స్పందిస్తూ.. ‘నిజంగా శక్తి కావాలంటే ఆవు దగ్గర శక్తి ఉంటుందా? పులి దగ్గర శక్తి ఉంటుందా? ఒకసారి ఆలోచన చేయండి. ఆవు దగ్గర శక్తి ఉంటుందా? సింహం దగ్గర శక్తి ఉంటుందా? ‘సింహబలుడు’ అంటారే గానీ, ‘ఆవు బలుడు’ అని ఎవరూ అనరు.

 కాబట్టి, కంచ ఐలయ్య గారు, సింహాలను, పులులను, నక్కలను, తోడేళ్లను తినమనాలి. అవి చాలా పవర్ ఫుల్. కర్షక వృత్తికి పూర్తిగా ఆధారంగా నిలబడే పశువులను అడ్డంగా నరికి తింటామని చెప్పి చట్టాలు చేయమంటారా? మాంసం తినాలనుకున్నవారు, శక్తి కావాలనుకున్న వారు పులులు, సింహాల మాంసాన్ని తింటే మరింత శక్తిమంతులవుతారు. కంచె ఐలయ్య గారికి తెలియడం లేదేమో.. సర్జికల్ స్ట్రైక్ కండబలంతో చేయలా, బుద్ధి బలంతో చేశారు. రాబోయే రోజుల్లో యుద్ధాలు కండ బలాలలతో జరగవండీ, బుద్ధిబలాలతోనే జరుగుతాయి’ అని పరిపూర్ణానంద స్వామి అన్నారు.

More Telugu News