: అందుకే, రోమ్ లో మెలానియా, ఇవాంకాల వస్త్రధారణ మారింది!

అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ విదేశీ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా, ఇటీవల సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. ట్రంప్ వెంట ఉన్న ఆయన భార్య మెలానియా ఆ దేశ సంప్రదాయం ప్రకారం తన తలపై ఎటువంటి వస్త్రం ధరించలేదు. దీంతో, విమర్శలు తలెత్తాయి. అయితే, రెండు రోజుల క్రితం  రోమ్ లోని పోప్ ఫ్రాన్సిస్ ను ట్రంప్ కుటుంబం కలిసిన విషయం విదితమే. పోప్ ను కలిసిన సందర్భంలో ట్రంప్ భార్య మెలానియా, కూతురు ఇవాంకాలు పొడవాటి చేతులు ఉన్న నలుపు రంగు దుస్తులు, తలపై వేల్ ధరించారు.

వాళ్లిద్దరూ ఈ విధమైన వస్త్రాలు ధరించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వాటికన్ సిటీ ప్రొటోకాల్ ప్రకారం, పోప్ ను కలిసే విదేశీ మహిళలు పొడవాటి చేతులు ఉన్న నలుపు రంగు దుస్తులు, తలపై వేల్ ను ధరించాల్సి ఉండగా, పురుషులు అయితే నలుపు రంగు సూట్, టై, తెలుపు రంగు చొక్కా ధరించాలి. పోప్ ను కలిసే సమయంలో క్యాథలిక్ క్వీన్స్, మొనాకో ప్రిన్సెస్ మాత్రం తెలుపు రంగు దుస్తులు ధరించేందుకు అనుమతి ఉంటుంది. పోప్ బెనడిక్ట్-16 హయాంలో ఈ నిబంధనలు అమల్లోకి వచ్చినట్టు డొనాల్ట్  ట్రంప్ ప్రెసిడెన్షియల్ ట్రాన్సిషన్ టీమ్ లో సభ్యుడు స్టెఫానీ గ్రీషమ్ పేర్కొన్నారు.

More Telugu News