: లక్షన్నర భోజనాలు... మహానాడు వంటశాలకు చేరిన ముడిసరుకు వివరాలు!

ప్రతియేటా వచ్చే తెలుగుదేశం పార్టీ పండగ 'మహానాడు' మరోసారి తిరిగొచ్చింది. పార్టీ ఆవిర్భావ వేడుకలు, మహానేత ఎన్టీఆర్ జన్మదినోత్సవంతో కలిపి జరుపుకునే మహానాడుకు ఈ సంవత్సరం విశాఖపట్నం వేదిక కానున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు జరిగే వేడుకల్లో సుమారు 40 వేల మంది వరకూ పాల్గొంటారన్న అంచనాలుండగా, మూడు రోజుల్లో సుమారు లక్షన్నర భోజనాలను నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ముడి పదార్థాలు మహానాడు వంటశాలకు చేరుకున్నాయి. ఆ వెంటనే పని మొదలు పెట్టారు.

మొత్తం 10 లారీల్లో ఈ సరుకులు రాగా, 400 మంది నిపుణులైన వంటవారు ఎన్నో రకాల వంటకాలను వండనుండగా, 600 మంది వాటిని అతిథులకు వడ్డించనున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి డిన్నర్ ఇవ్వనున్నారు. ఇందుకోసం 12 టన్నుల బియ్యం, 8 టన్నుల బిరియానీ బియ్యం, 100 బ్యాగుల కందిపప్పు, 500 నూనె డబ్బాలు, 40 బస్తాల చొప్పున ఇడ్లీ రవ్వ, బొంబాయి రవ్వ, మినప్పప్పు తదితరాలు వంటశాలకు చేరాయి. వీటితో పాటు మరో రెండు లారీల నిండా వివిధ రకాల కూరగాయలు, ఇతర దినుసులు వచ్చాయి. భోజనంలో కనీసం 20కి పైగా ఐటమ్స్ ఉంటాయని, అల్పాహారంలో ఉప్మా, ఇడ్లీ, వడ తదితరాలుంటాయని వంటశాల ప్రతినిధులు తెలిపారు.

More Telugu News