: సిరియాలో తమ దాడుల్లో సాధారణ పౌరులు కూడా మృతి చెందినట్టు అమెరికా ప్రకటన!

అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనల దాడిలో సిరియా సాధారణ పౌరులు కూడా మృత్యువాత పడినట్టు పెంటగాన్‌ తొలిసారి ప్రకటన చేసింది. ఎక్కడైనా దాడులు జరిపినప్పుడు తాము ఉగ్రవాదులను మాత్రమే లక్ష్యం చేసుకుని దాడులు చేశామని, ఆ దాడులు విజయవంతమయ్యాయని ప్రకటించే పెంటగాన్ తొలిసారి తాము చేసిన దాడుల్లో సాధారణ పౌరులు కూడా మృత్యువాతపడ్డారని అంగీకరించింది. సిరియాలోని మోసూల్ లో మార్చిలో సంకీర్ణ సేనల దాడుల్లో సుమారు 105 మంది సిరియన్లు మృతి చెందారని యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ ప్రకటనలో తెలిపింది. మరోవైపు సిరియాలో మానవ హక్కులు యథేచ్ఛగా ఉల్లంఘనలకు గురవుతున్నాయని ఐక్యరాజ్యసమితి పేర్కొంటోంది.

తాజాగా ‌ఐఎస్ఐఎస్ అధీనంలోని మయాదీన్‌, మోసుల్‌ పట్టణాల్లో అమెరికా యుద్ధవిమానాలు జరిపిన బాంబు దాడుల్లో కనీసం 50 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని సిరియా మానవ హక్కుల పరిశీలన సంస్థ (ఎస్‌ఓహెచ్‌ఆర్‌) తెలిపింది. దీనిని అమెరికా రక్షణ శాఖ ప్రధాన కేంద్రం పెంటగాన్‌ కూడా అంగీకరించింది. తాజాగా అమెరికా ఆధ్వర్యంలోని సంకీర్ణ సేనలు జరిపిన బాంబు దాడులతో ఈ ఏడాది ఏప్రిల్‌ 23 నుంచి మే 23 వరకు మరణించిన పౌరుల సంఖ్య 225 కు పెరిగిందని ఎస్ఓహెచ్ఆర్ వెల్లడించింది. ఐఎస్ఐఎస్ పేరుతో సిరియా, ఇరాక్ లలో సంకీర్ణ సేనలు 2014 నుంచి ఇప్పటి వరకు 8000 మందిని హతమార్చగా, అందులో 6000 మంది ఉగ్రవాదులు, మిగిలిన 2000 మంది సాధారణ పౌరులని ఎస్ఓహెచ్ఆర్ వెల్లడించింది.

More Telugu News