: పాకిస్థాన్‌లో చైనా జంట కిడ్నాప్.. రక్షించాలంటూ పాక్‌పై ఒత్తిడి పెంచిన డ్రాగన్ కంట్రీ

బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాలో అపహరణకు గురైన చైనా జంటను రక్షించాలంటూ పాకిస్థాన్‌పై చైనా ఒత్తిడి తీసుకొచ్చింది. వారిని రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని చైనా అధికారులు కోరారు.  స్థానిక స్కూల్‌లో చైనా భాషను బోధిస్తున్న ఈ జంటను బుధవారం జిన్నాలో పోలీసుల పేరుతో వచ్చిన ముగ్గురు ఆగంతుకులు కిడ్నాప్ చేశారు. వారి తలలకు తుపాకి గురిపెట్టిన కిడ్నాపర్లు తెల్లని కారులో వారిని అపహరించుకుని వెళ్లినట్టు పాకిస్థాన్ మీడియా పేర్కొంది.

కిడ్నాపర్లు వారిని ఎక్కడికి తీసుకెళ్లారు? ఎందుకు తీసుకెళ్లారు? అన్న విషయాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. అందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులు ఇప్పటి వరకు గుర్తించలేకపోయారు. చైనా జంట కిడ్నాప్‌పై హైపవర్ ఇన్వెస్టిగేషన్ గ్రూప్ రంగంలోకి దిగింది. కిడ్నాప్ జరిగినప్పటి నుంచి పాకిస్థాన్‌తో నిత్యం మాట్లాడుతున్నామని, వారిని రక్షించే చర్యలను వేగవంతం చేయాలని కోరినట్టు చైనా విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లు కాంగ్ తెలిపారు. అలాగే పాకిస్థాన్‌లోని చైనీయులకు మరింత భద్రత కల్పించాలని కోరినట్టు తెలిపారు.

More Telugu News