: సీపీఈసీ రక్షణ కోసం పాకిస్థాన్‌కు రెండు నౌకలను ఇచ్చిన చైనా.. మరో రెండు ఇచ్చేందుకు కూడా రెడీ!

చైనా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) రక్షణ కోసం చైనా గురువారం పాకిస్థాన్‌కు రెండు సముద్ర గస్తీ నౌకలను ఇచ్చింది. పీఎంఎస్ఎస్ హింగోల్, పీఎంఎస్ఎస్ బాసోల్‌గా వ్యవహరించే ఈ నౌకలను పాకిస్థాన్ నేవీ వైస్-అడ్మిరల్ అరిఫుల్లా హుస్సైని అందుకున్నట్టు డాన్ పత్రిక తెలిపింది. ఈ రెండు నౌకలు నేటి నుంచి పాక్ ఆర్మీలో భాగం కానున్నాయని, వీటి చేరికతో పాక్ నేవీ మరింత బలోపేతమైందని హుస్సైనీ తెలిపారు. పాకిస్థాన్-చైనా బంధం మరింత దృఢంగా, సముద్రం కంటే లోతైనదని ఆయన అభివర్ణించారు. కాగా, చైనా మరో రెండు నౌకలను కూడా పాక్‌కు ఇవ్వాలని యోచిస్తోంది. ‘దస్త్’, ‘జోబ్’ నౌకలు త్వరలోనే పాకిస్థాన్ చేరుకుంటాయని చెబుతున్నారు. సీపీఈసీ రక్షణకు పాకిస్థాన్ ఇప్పటికే అక్కడ ఆర్మీని మోహరించిన విషయం తెలిసిందే.

More Telugu News