: యూపీ సీఎం కాన్వాయ్ ను అడ్డుకునేందుకు యత్నించిన మహిళ

యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ కాన్వాయ్ ను ఓ మహిళ అడ్డుకుంది. దీంతో, అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను పక్కకు తీసుకువెళ్లేందుకు యత్నించారు. అజాంగఢ్ లోని ఓ రోడ్డు మార్గం ద్వారా ఈ రోజు సీఎం యోగి వస్తున్నారనే విషయం తెలుసుకున్న ఆశా వర్కర్ శుభావతి దేవి, కాన్వాయ్ రావడానికి ముందుగా వచ్చే ట్రయల్ వాహనాలకు ఎదురెళ్లింది. ఆమెను పక్కకు తీసుకువెళ్లేందుకు యత్నించిన సెక్యూరిటీ సిబ్బందిని శుభావతి దేవి తోసివేసింది.

తమకు జీతభత్యాలు చెల్లించడం లేదని, సీఎంను తాము కలవాలంటూ ఆమె నినాదాలు చేసింది. ఈలోగా, సీఎం అక్కడికి రావడం జరిగింది. విషయం తెలుసుకున్న యోగి వెంటనే శుభావతి దేవిని, ఆమెతో ఉన్న మరో మహిళను తనను కలిసేందుకు అనుమతించారు. అయితే, శుభావతి దేవి ఏదో చెబుతుండగా, ‘జిందాబాద్’ అంటూ పలువురు అక్కడికి రావడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ తతంగంలో యోగికి అందజేద్దామనుకున్న వినతిపత్రం ఆమె చేతిలో నుంచి కింద పడిపోయింది.

More Telugu News