: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో ఈ రోజు సాయంత్రం వర్షం కురిసింది. మ‌ధ్యాహ్నం పూట ఠారెత్తించిన ఎండ‌ల‌తో అల్లాడిపోయిన న‌గ‌రవాసులు సాయంత్రం కురిసిన వ‌ర్షపు జ‌ల్లుల‌తో కాస్త సేద‌తీరారు. వ‌ర్షం కార‌ణంగా ప‌లుచోట్ల రోడ్ల‌పై నీరు నిలిచింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. న‌గ‌రంలోని తార్నాక, హబ్సిగూడ, లాలాపేట్, చర్లపల్లి, నాగారం, నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో వర్షం ప‌డింది.                 

More Telugu News