: ఒక్క బిట్ కాయిన్ విలువ రూ. 2 లక్షలకు పైమాటే... అందనంత ఎత్తునకు క్రిప్టో కరెన్సీ విలువ!

బిట్ కాయిన్... మొన్నమొన్నటి వరకూ ఈ పేరు పెద్దగా తెలియనిది. ర్యాన్సమ్ వేర్ వాన్నా క్రైని కంప్యూటర్లలోకి చొప్పించిన హ్యాకర్లు డబ్బు డిమాండ్ చేస్తూ, దాన్ని బిట్ కాయిన్ల రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఈ పేరు తెలియని వారికి కూడా తెలిసిపోయింది. వాస్తవానికి ఇది క్రిప్టో కరెన్సీ. ఏ దేశానికీ చెందదు సరికదా, ఏ నియంత్రణ సంస్థ పరిధిలోకీ రాదు. అచ్చమైన అంతర్జాతీయ కరెన్సీ. దీని సృష్టికర్త ఎవరో కూడా ఎవరికీ కూడా స్పష్టంగా తెలియదు. కానీ, ఇప్పుడు దాని విలువ 2,550 డాలర్లు. అంటే సుమారు రూ. 2.13 లక్షలకు పైమాటే. ఈ సంవత్సరం ఆరంభంలో బిట్ కాయిన్ విలువతో పోలిస్తే ఇది 155 శాతం అధికం.

ఇటీవలి కాలంలో బిట్ కాయిన్ల విలువ పెరుగుతూ ఉండటంతో, ప్రపంచవ్యాప్తంగా ఈ కరెన్సీ 88 బిలియన్ డాలర్లకు చేరుకుందని అంచనా. ప్రపంచంలో క్రిప్టో కరెన్సీల్లో బిట్ కాయిన్ తొలి స్థానంలో ఉండగా, ఆపై ఎతిరియమ్, రిపిల్ ఉన్నాయి. ఎతిరియమ్ విలువ తొలుత 8.5 డాలర్లుండగా, ఇప్పుడది 2,400 శాతం పెరిగి 200 డాలర్లకు చేరుకుంది. రిపిల్ విలువ కూడా దాదాపు అంతే మొత్తం పెరిగింది. బయటకు తెలిసిన వివరాల ప్రకారం, బిట్ కాయిన్ తదితర క్రిప్టో కరెన్సీలను జపాన్ నిర్వహిస్తోంది. 2008లోనే ఇందుకు సంబంధించిన కథనాలు వచ్చాయి. ఆపై మరో ఏడాదికి ఈ వ్యవస్థ ప్రపంచానికి పరిమితమైంది. మొత్తం బిట్ కాయిన్ల సంఖ్యను 2.1 కోట్లను దాటనీయరాదన్న నిబంధన ఉండటం, పలువురు తమ వద్ద ఉన్న ఎతిరియమ్ కాయిన్స్ ను బిట్ కాయిన్ల రూపంలోకి మార్చుకుంటూ ఉండటంతోనే ఈ కరెన్సీకి డిమాండ్ అమాంతం పెరుగుతోందని నిపుణులు వ్యాఖ్యానించారు.

More Telugu News