: ఆడది లేకపోతే మగాడు లేడు.. నా వ్యాఖ్యలను రాద్ధాంతం చేశారు!: 'వెకిలి' వ్యాఖ్యలపై చలపతి రావు వివరణ

ఆడది లేకపోతే మగాడు లేడని ప్రముఖ సినీ నటుడు చలపతిరావు తెలిపారు. 'రారండోయ్ వేడుక చూద్దాం' వేడుకలో మహిళలపై తాను చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలపై పెను దుమారం రేగడంతో ఆయన వివరణ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతి మగాడి విజయం వెనుక స్త్రీ ఉంటుందని, ట్రంప్, ఒబామా.. ఇలా ఏ ప్రముఖులను చూసినా, తనలాంటి వారిని తీసుకున్నా స్త్రీ సేవలు మరువలేనివని ఆయన చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేంటో తనకు తెలియదని ఆయన చెప్పారు. ఆడవాళ్లు పక్కలోకి పనికొస్తారంటే... కేవలం సెక్స్ మాత్రమే కాదని ఆయన చెప్పారు. అంతకంటే ఎన్నో ఉన్నత భావాలు చాలా ఉంటాయని చెప్పారు.  

More Telugu News