: రోడ్డెక్కిన రజనీకాంత్ అభిమానులు.. వందలాది మంది అరెస్ట్

నిన్నటిదాకా రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీని వ్యతిరేకిస్తూ తమిళ సంఘాలు రోడ్డెక్కాయి. నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. 'రజనీకాంత్ నాన్ లోకల్' అంటూ స్థానికత అంశాన్ని తెరపైకి తెచ్చాయి. తమిళ సంఘాల నేతలు, కార్యకర్తలు రజనీకాంత్ ఇంటిని కూడా ముట్టడించారు. తమిళనాడులో ఒకటి రెండు చోట్ల తలైవా దిష్టిబొమ్మలను కూడా దగ్ధం చేశారు.

ఈ నేపథ్యంలో, తమ అభిమాన నటుడి ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ప్రవర్తిస్తున్న వారికి వ్యతిరేకంగా రజనీ అభిమానులు ఈరోజు రోడ్డెక్కారు. చెన్నైలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. రజనీని వ్యతిరేకిస్తున్న తమిళ సంఘాల దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. తమిళ సంఘాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రజనీ రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ నినదించారు. దీంతో, పోలీసులు రంగ ప్రవేశం చేశారు. వందలాది మంది రజనీ అభిమానులను అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు, రజనీ నివాసం వద్ద కూడా భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. 

More Telugu News