: తగ్గనున్న స్మార్ట్ ఫోన్ ధరలు, సిమెంట్ ధరలు కూడా!

జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను అమల్లోకి రానుండగా, ఇప్పటికే 1000కి పైగా వస్తువులు, సేవలపై వసూలు చేసే పన్ను వివరాలను కేంద్రం వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా స్మార్ట్ ఫోన్లు, వైద్య రంగంలో ఉపయోగించే పరికరాలు, సిమెంట్ ధరలపై పన్ను వివరాలను వెల్లడించింది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లపై సగటున 13.5 శాతం పన్నులు ఉండగా, వస్తు సేవల పన్ను అమల్లోకి వచ్చిన తరువాత 12 శాతమే పన్ను వసూలు చేస్తామని తెలిపింది. వైద్య పరికరాలపై 13 శాతంగా ఉన్న పన్నును 12 శాతంగా, సిమెంట్ పై 31 శాతం ఉన్న పన్నును 28 శాతంగా నిర్ణయించామని, జీవ రసాయనాలు, యునానీ, ఆయుర్వేదం, హోమియోపతి తదితరాల్లో వాడే ముడి పదార్థాలపై 13 శాతంగా ఉన్న జీఎస్టీని 12 శాతానికి తగ్గించినట్టు తెలిపింది. ఈ కారణంగా స్మార్ట్ ఫోన్లు, సిమెంట్ ధరలు స్వల్పంగానైనా తగ్గనున్నాయి.

More Telugu News