: సీన్ రివర్స్: అప్పుడు భారత్ పై ఆంక్షలు విధించిన అమెరికా ఇప్పుడు ఇస్రోతో చేతులు కలిపింది!

అంతరిక్ష పరిశోధనలో తిరుగులేని విజయాలు నమోదు చేస్తూ దూసుకుపోతున్న ఇస్రోతో అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కలిసి పనిచేస్తోంది. 1992లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్... భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోపై ఆంక్షలు విధించారు. భారత్‌కు క్రయోజనిక్ ఇంజిన్ పరిజ్ఞానం విక్రయించరాదంటూ రష్యాను కూడా అడ్డుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయింది. ఇప్పుడు  రాకెట్‌కు ఉపయోగించే క్రయోజనిక్ ఇంజిన్‌ను భార‌త్ సాయంతో అదే అమెరికా కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది.
 
భార‌త్‌, అమెరికా సంయుక్తంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. దీని కోసం
ఇరు దేశాలు 1.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.9687 కోట్లు) వినియోగిస్తున్నాయి. ‘నాసా-ఇస్రో సింథటిక్ అపెర్‌ట్యూర్ రాడార్ (ఎన్ఐఎస్ఏఆర్)ను భారత్‌కు చెందిన జీఎస్ఎల్‌వీ 2021లో కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ఇందులో ఉపయోగించే అడ్వాన్స్‌డ్ రాడార్ ఇమేజింగ్ ద్వారా భూమిని సమగ్రంగా అధ్యయనం చేయవచ్చని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. అంతేకాదు, ఎంతో క‌ష్ట‌మైన కొన్ని గ్రహాల కొలతలను కూడా తీసుకోవచ్చని, పర్యావరణ ఇబ్బందులను తొలగించవ‌చ్చ‌ని తెలుపుతున్నారు. అంతేగాక ఈ అతి పెద్ద ప్రాజెక్ట్‌తో ప‌లు ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.

More Telugu News