: అల్లు అర్జున్ కొత్త సినిమా సాంగ్ విడుదల... అదుర్స్ అంటున్న అభిమానులు

దర్శకుడు హ‌రీశ్ శంక‌ర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్‌’ సినిమాలోని  ‘డీజే శరణం.. భజే భజే..’ అనే పాట‌ను ఆ సినిమా యూనిట్ ఈ రోజు సాయంత్రం విడుద‌ల చేసింది. అల్లు అర్జున్ అభిమానులు ఈ సినిమాపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో బ‌న్నీ స‌ర‌స‌న పూజా హెగ్డే న‌టిస్తోంది. వ‌చ్చేనెల ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. విడుద‌లైన గంటలోనే ఈ సాంగును ల‌క్ష మందికి పైగా అభిమానులు వీక్షించారు. మీరూ చూడండి..



More Telugu News