: పాప డ్రెస్సుని ఆహార పదార్ధం అనుకుని సముద్రంలోకి లాగేసిన సీల్... వీడియో చూడండి

సాధారణంగా జూకి వెళ్లినా, అక్వేరియంలకు వెళ్లినా అందులోని జంతువులకు ఆహారపదార్థాలు పెట్టడం ద్వారా పర్యాటకులు ఆనందాన్ని పొందుతారు. అయితే వాటికి అలవాటు పడ్డ జంతువులు అలా పర్యాటకులు విసిరే ఆహారం కోసం ఆశగా ఎదురు చూస్తుంటాయి. ఒక్కోసారి ఇది ప్రమాదాలకు కూడా కారణమవుతుంది. అలాంటి ఘటన కెనడా వెస్టర్న్‌ కోస్ట్‌ లోని స్టీవెస్టన్‌ సముద్ర తీరంలో చోటుచేసుకుంది. అక్కడి అందాలను చూసేందుకు పలువురు పర్యాటకులు ఆక్కడికి చేరుకోగా, వారు విసురుతున్న ఆహారం అందుకునేందుకు ఒక సీల్ అక్కడికి వచ్చింది.

అయితే దానిని దగ్గరగా వెళ్లి చూసేందుకు ఓ పాప ఆసక్తి చూపింది. ఇంతలో సీల్ కొంత పక్కకి వెళ్లడంతో ఆ పాప సీల్ ను చూస్తూ అక్కడ ఏర్పాటు చేసిన చిన్న వంతెనలాంటి దానిపై కూర్చుంది. ఇంతలో వెనుదిరిగిన సీల్ ఆమె వేసుకున్న తెల్లని డ్రెస్ ను చూసి ఆహారం అనుకుని అమాంతం పైకి ఎగిరి, ఆ డ్రెస్సును నోటకరుచుకుని చటుక్కున నీట్లోకి వెళ్లిపోయింది. దీంతో ఆ పాప కూడా నీట్లోకి వెళ్లిపోయింది. వెంటనే స్పందించిన ఓ పర్యాటకుడు వేగంగా నీట్లోకి దూకి, పాపను పైకి తీసుకొచ్చాడు. వారిద్దరికీ ఏమీ కాలేదు. దీంతో అంతా అవాక్కయ్యారు. పాపను తల్లిదండ్రులు వేగంగా అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ఆ వీడియోను మీరు కూడా చూడండి.




More Telugu News