: రైతన్నలకు బేడీలు వేసిన ప్రభుత్వంపై మిలిటెంట్ పోరాటాలు సాగించాలి: మావోయిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి ఆజాద్

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిన సీఎం కేసీఆర్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని, నిజాంను తలదన్నే నియంతృత్వాన్ని కొనసాగిస్తున్నారని మావోయిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి ఆజాద్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ రాశారు. రైతన్నలకు బేడీలు వేసిన ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు మిలిటెంట్ పోరాటాలు సాగించాలని పిలుపు నిచ్చారు. ఒకేసారి రుణమాఫీ అని చెప్పి దఫదఫాలుగా మాఫీ చేస్తున్నారని, గత్యంతరం లేని పరిస్థితిలో రైతులు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని, దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆ లేఖలో విమర్శించారు. రైతుల ఆత్మహత్యలను ఆపలేని ప్రభుత్వం, ఇతర కారణాలు చూపుతూ వారిపైనే నిందలు వేస్తోందని ఆరోపించారు. ఖమ్మం మార్కెట్లో మిరపకు గిట్టుబాటు ధర ఇప్పించాలని ఆందోళన చేసిన రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, వారిపై పెట్టిన కండీషన్డ్ బెయిల్ ను రద్దు చేయాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు.

More Telugu News