: ఆర్ఎస్ఎస్ అనేది లేకుంటే.. పంజాబ్, జమ్ముకశ్మీర్, పశ్చిమబెంగాల్.. పాక్‌లో ఉండేవి: యూపీ సీఎం యోగి

ఆర్ఎస్ఎస్ అనేది లేకుంటే దేశంలోని మూడు రాష్ట్రాలు పాకిస్థాన్‌లో కలిసిపోయేవని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఆర్ఎస్ఎస్ దేశంలో అతిపెద్ద జాతీయవాద సంస్థ అని పేర్కొన్నారు. స్వయం సేవకులు, ప్రచారకుల సాయంతో దేశానికి, సంస్కృతికి నిస్వార్థంగా సేవలు అందిస్తున్న ప్రపంచంలోనే ఒకేఒక్క సంస్థ ఆర్ఎస్ఎస్ అని కొనియాడారు. ఆ సంస్థ లేదంటే ఆ సంస్థ నేత డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ కనుక లేకుంటే పంజాబ్, జమ్ముకశ్మీర్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు పాకిస్థాన్‌లో అంతర్భాగం అయి ఉండేవన్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం ఆశించకుండా ఆర్ఎస్ఎస్ నిస్వార్థంగా సేవలు అందిస్తోందని యోగి ప్రశంసించారు.

More Telugu News