: అప్పుడు మిషెల్ ఒబామాను విమర్శించిన ట్రంప్ ఇప్పడేం సమాధానం చెబుతారో!

తొలి విదేశీ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భార్యతో కలిసి ఎయిర్ ఫోర్స్ వన్ లో ఠీవీగా సౌదీ అరేబియాలో అడుగు పెట్టారు. ట్రంప్ బ్లాక్ సూట్ లో మెరిసిపోగా, మెలానియా బ్లాక్ మోడ్రన్ డ్రెస్ పైన లాంగ్ కోట్ ధరించి విమానం దిగారు. మహిళల పట్ల ఎన్నో నిబంధనలు వుండే సౌదీలో మెలానియా ట్రంప్ తలపై ఏ ఆచ్ఛాదన లేకుండానే అడుగుపెట్టారు. మామూలుగా సౌదీలో ఇస్లామిక్ సంప్రదాయాలు కఠినంగా అమలవుతాయి. అక్కడ స్త్రీలు తలపై జట్టు కనిపించకుండా వస్త్రాన్ని కప్పుకోవాలి.

గతంలో అలా చేయలేదని ట్రంప్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామాపై నిప్పులు చెరిగారు. మిషెల్ ఒబామా సౌదీ అరేబియాను అవమానించారని, దీనివల్ల అమెరికాకు శత్రువులు పెరిగిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన వంతు వచ్చింది. ఈసారి ఆయన భార్యతో పాటు కుమార్తె ఇవాంకా ట్రంప్ కూడా తలపై ఎలాంటి వస్త్రాన్ని ధరించలేదు. కాగా, విదేశీ పర్యాటకులు, పాశ్చాత్య మహిళలకు ఈ విషయంలో మినహాయింపు ఉంది.

More Telugu News