: కలకలం రేపిన పన్నీర్‌ సెల్వం ట్వీట్... విమర్శలతో డిలీట్... కొత్త ప్రకటన

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, పురచ్చి తలైవి (అమ్మ) అ‍న్నాడీఎంకే పార్టీ అధినేత పన్నీర్‌ సెల్వం చేసిన ఒకేఒక్క ట్వీట్ ఆ రాష్ట్రంలో పెనుకలకలం రేపింది. దీంతో ఆ ట్వీట్ ను తొలగించి, మరొక ట్వీట్ ను సరికొత్తగా పోస్టు చేశారు. దాని వివరాల్లోకి వెళ్తే... ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసిన పన్నీరు సెల్వంపై డీఎంకే విమర్శలు ఎక్కుపెడుతున్న సమయంలో ‘స్థానిక ఎన్నికల షెడ్యూలు వచ్చిన తర్వాత మేం బీజేపీతో పొత్తు విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాం’ అంటూ పన్నీర్‌ సెల్వం తరుపున ట్వీట్లు చేసే ఆయన కార్యాలయం ఒక ట్వీట్‌ చేసింది. ఇది  తమిళనాట పెను కలకలం రేపింది.

దీనిపై విస్తృత చర్చ మొదలైంది. జయలలిత మరణం తరువాత తమిళనాట పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ కుయుక్తులు పన్నుతోందని అనుమానించిన తమిళులు... తాజా ట్వీట్ తో అసలు ఏం జరుగుతోందంటూ స్పందించడం మొదలుపెట్టారు. నిన్నటి వరకు పన్నీర్ సెల్వంపై సానుభూతి చూపినవారంతా... పన్నీర్ సెల్వానికి వ్యతిరేకంగానే స్పందించారు. విమర్శలు మొదలయ్యాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆయన టీం... ఆ ట్వీట్‌ ను తొలగించి, దాని స్థానంలో... 'స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు విడుదల చేసిన తరువాత పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటాం... ఆ పొత్తు ఏ పార్టీతో ఉంటుందనే విషయం ఇప్పుడే స్పష్టం చేయలేమని' మళ్లీ ట్వీట్ చేసింది. 

More Telugu News