: అమెరికా, సౌదీ అరేబియా మధ్య భారీ ఆయుధ ఒప్పందం.. ట్రంప్ టూర్ సక్సెస్!

అమెరికా-సౌదీ అరేబియా మధ్య అతిపెద్ద ఆయుధ ఒప్పందం కుదిరింది. ఏకంగా 350 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదరగా తక్షణం 110 బిలియన్ డాలర్ల డీల్ అమల్లోకి వస్తుంది. మిగతా ఒప్పందం వచ్చే పదేళ్లలో అమలవుతుంది. ఈ మేరకు శనివారం వైట్‌హౌస్ ప్రకటించింది. సౌదీ అరేబియాతో దశాబ్దాలుగా కొనసాగుతున్న బంధం తాజా ఆయుధ డీల్‌తో మరింత బలోపేతం అవుతుందని పేర్కొంది. ఇరు దేశాల మధ్య భద్రతా సంబంధాలు మరింత దృఢమైనట్టు తెలిపింది. తాజా ఒప్పందంతో సౌదీ మిలటరీ శక్తిసామర్థ్యాలు మరింత శక్తిమంతం కానున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ డీల్‌ చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీలో అధికారిక పర్యటనలో ఉన్నారు. సొంత దేశంలో ప్రతిష్ఠ క్రమంగా మసకబారుతున్న వేళ అమెరికా బయట సాధించిన ఈ డీల్ అతి పెద్ద విజయమని నిపుణులు చెబుతున్నారు.

More Telugu News