: రజనీ రాజకీయాలపై తమిళనేతల స్పందన ఇదీ!

తాను రాజకీయాల్లోకి వచ్చేదీ రానిదీ దేవుడి నిర్ణయం ప్రకారమే జరుగుతుందని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ, రజనీపై విమర్శలు, అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న ప్రముఖులు వెనకడుగు వేయడం లేదు. రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై తమిళ పార్టీల నేతలు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.

రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నామని తమినాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత స్టాలిన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చని పన్నీర్ సెల్వం పేర్కొనగా, బీజేపీ కోరల్లో చిక్కుకోకుండా సొంతంగా రాజకీయాలు చేస్తే మంచిదని, తమిళులను అణగదొక్కాలని చూస్తున్న బీజేపీతో జత కడితే తమిళ రాష్ట్రం మరింత ఇబ్బందులు పడుతుందని డీఎండీకే నేత విజయ్ కాంత్ అన్నారు. దర్శకుడు శ్రీమాన్ మాట్లాడుతూ, రజనీకాంత్ తమిళనాడు వాసిగా చెప్పుకోవడం మంచిదే కానీ, రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని అన్నారు.

More Telugu News