: అమిత్ షా చూపు కమ్యూనిస్టులపై ఉన్నప్పటికీ.. దాడి మాత్రం టీఆర్ఎస్ పైనే: సీపీఐ నారాయణ

బీజేపీ పాలనలో దళితులపై దాడులు ఎక్కువయ్యాయని... గోరక్ష పేరుతో హత్యలు చేస్తున్నారని సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. ఏటీఎంలను పక్కనపెట్టి పేటీఎంలు తీసుకొచ్చారని విమర్శించారు. పార్టీ భవిష్యత్తు గురించి మోదీ భయపడుతున్నారని... అందుకే ముందస్తు ఎన్నికలు తెస్తున్నారని అన్నారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగితే చాలా బాగుంటుందని... కానీ, ఆచరణలో అది సాధ్యం కాదని తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేస్తున్న దళిత జపం అంతా కొంగ జపమే అని అన్నారు. దళితవాడలకు వెళ్లి భోజనాలు చేయడం పాపాలు కడుక్కోవడానికే అని ఎద్దేవా చేశారు. అమిత్ షా చూపు కమ్యూనిస్టులపై ఉన్నప్పటికీ... ఆయన దాడి మాత్రం టీఆర్ఎస్ పైనే అని చెప్పారు. బీజేపీ పట్ల టీఆర్ఎస్ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. 

More Telugu News