: చార్ థామ్ యాత్రికులందరూ క్షేమంగానే ఉన్నారు: ఉత్తరాఖండ్ సీఎం

బదరీనాథ్ కు వెళ్లే మార్గంలో నిన్న కొండచరియలు విరిగిపడటంతో, యాత్రికులు చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమయ్యేందుకు ఈ రోజు గ్యాంగ్ టక్ కు వచ్చిన ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, చార్ ధామ్ యాత్రికులందరూ క్షేమంగా ఉన్నారన్నారు. విష్ణుప్రయాగ్ వద్ద నిన్న కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదన్నారు. పదిహేను వేల మంది యాత్రికులు చిక్కుకుపోయారని మీడియాలో వచ్చిన వార్తలు అబద్ధమని, 1800 మంది యాత్రికులు మాత్రమే ఉన్నారని చెప్పారు. విపత్తు నిర్వహణ శాఖాధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారని, మరికొన్ని గంటల్లోనే బద్రీనాథ్ వెళ్లే రహదారి అందుబాటులోకి వస్తుందని అన్నారు.

More Telugu News