: ఈవీఎంల సవాలుకు ఈసీ సై.. శనివారం ప్రకటించనున్న వివరాలు

ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపై రాజకీయ పార్టీలకు సవాలు విసిరేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. ఈవీఎంల పనితీరును నిరూపించేందుకు బహిరంగ పరీక్షకు సన్నద్ధమైంది. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం ప్రకటించనున్నట్టు తెలిపింది. నేడు నిర్వహించనున్న మీడియా సమావేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగంతోపాటు, కాగితపు స్లిప్పులపై వివరాలు నమోదయ్యే యంత్రాల గురించి కూడా ఈసీ వివరించినట్టు ఈసీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల సందర్భంగా ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురయ్యాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. తిరిగి పాతకాలం నాటి బ్యాలెట్ విధానానికి మారిపోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ తాజా సవాలుకు సిద్ధమైంది.

More Telugu News