: దక్షిణ చైనా సముద్రంపై భారత్, సింగపూర్ నౌకాదళ విన్యాసాలు.. స్పందించిన చైనా

దక్షిణ చైనా సముద్రంపై పూర్తి హక్కులు తమకే ఉన్నాయ‌ని చైనా వాదిస్తోన్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం అదే స‌ముద్రంపై భారత్‌, సింగపూర్‌లు సంయుక్తంగా నౌకాదళ విన్యాసాలు నిర్వ‌హిస్తున్నాయి. ఈ విష‌యంపై స్పందించిన చైనా దీనిప‌ట్ల త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రాలు లేవ‌ని, అయితే ఈ చర్యలు తమ దేశ ప్రయోజనాలకు, ప్రాంతీయంగా ఉన్న శాంతియుత వాతావరణానికి భంగం కలిగించకూడ‌ద‌ని తెలిపింది.

ఈ అంశంపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హు చున్‌యింగ్ మాట్లాడుతూ... భార‌త్‌, సింగ‌పూర్‌ లు త‌మ త‌మ‌ దేశాల మధ్య పరస్పర సహకారం పెంపొందించుకోవడానికే ద‌క్షిణ చైనా స‌ముద్రంపై ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు తాము అనుకుంటున్నామ‌ని వ్యాఖ్యానించారు. ఆ ప్ర‌దేశంలో భార‌త్‌, సింగ‌పూర్ ఏవైనా చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే ప్రాంతీయంగా ఉన్నటువంటి శాంతి, స్థిరత్వంలపై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతుంద‌ని తెలిపారు.

More Telugu News