: ‘బాహుబలి’లోలా బాలీవుడ్ సినిమా కోసం కొత్త భాష!

‘మహాక్కి..చూహూ..చున్న మతాస్వీక్ డీ..థారా..ఘరాక్స్..హూర్ర్..ఆర్ర్..’అంటూ ‘బాహుబలి-1’ చిత్రంలో కాలకేయుడు మాట్లాడిన భాష గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా కోసం ఈ భాష (కిలికి)ను నాడు ప్రత్యేకంగా క్రియేట్ చేశారు. తాజాగా, బాలీవుడ్ దర్శకుడు ఖారి బోలి తెరకెక్కించనున్న ‘రాబ్తా’ చిత్రం కోసం ఓ కొత్త భాషను సృష్టించారు.

అవాధి, బ్రిజ్, ఉర్దూ భాషలు కలగలిపిన ఓ కొత్త భాషను ఇందుకోసం సృష్టించారట. ఆ భాష పేరు ‘లికి’. ఈ చిత్రంలో రెండో భాగం మొత్తం మూడువేల ఏళ్ల క్రితం నాటి సామ్రాజ్యం గురించి చూపించనున్నారు. ఈ సామ్రాజ్యంలో చూపించబోయే మనుషులు ఈ భాషనే మాట్లాడుకుంటారని సినీ రచయితలు సిద్ధార్థ్, గరిమ మీడియా ద్వారా తెలిపారు. కాగా, వచ్చే నెల 9న ఈ చిత్రం విడుదల కానుంది.

More Telugu News