: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత మరింత పెరిగింది: వాతావరణ శాఖ హెచ్చరికలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండ‌ల తీవ్ర‌త మ‌రింత పెరిగిపోయింద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు పేర్కొన్నారు. సాధార‌ణం కంటే 4 నుంచి 7 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయ‌ని, ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు వ‌హించాల‌ని సూచించారు. వాయవ్య భారత్‌ నుంచి వీస్తున్న గాలులు వేడిమిని మరింత పెరిగేలా చేస్తున్నాయ‌ని తెలిపారు. రాత్రిపూట కూడా వేడిగాల్పుల ప్ర‌భావం అధికంగా ఉంద‌ని తెలిపారు. ఇదిలా ఉండ‌గా కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో క్యుములో నింబస్‌ మేఘాల ప్ర‌భావంతో వ‌ర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో జల్లులు పడటంతో ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్ర‌త‌లు కాస్త త‌గ్గాయి. అయితే, వాయవ్యం నుంచి వీస్తున్న ఉష్ణగాలుల ప్రభావంతో గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలలోని ప‌లు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత అధికంగా ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెప్పారు.

More Telugu News