: హైదరాబాద్ పోలీసులు సూపర్.. మామూళ్లు అడగరు: కేసీఆర్

రాష్ట్ర పోలీసులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. పోలీసుల పనితీరు ఎంతో బాగుందని... ఢిల్లీ స్థాయిలో మన పోలీస్ డిపార్ట్ మెంట్ కు ప్రశంసలు దక్కుతున్నాయని ఆయన అన్నారు. ఈ రోజు హైదరాబాదులో పోలీస్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్ లో కేసీఆర్ మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ చాలా క్లిష్టమైనదని చెప్పారు. లంచం తీసుకోకుండా పోలీసులు సేవలు అందించాలని అన్నారు. హైదరాబాద్ పోలీసులు మామూళ్లు అడగడం లేదని చెప్పారు. మామూలుగా పోలీసుల పేరు చెప్పుకుని ఓట్లు అడగడానికి రాజకీయ పార్టీలు భయపడతాయని... కానీ, తాము జీహెచ్ఎంసీ ఎన్నికల్లో షీ టీమ్స్ బొమ్మలు పెట్టి ఓట్లు అడిగామని తెలిపారు.

ఉద్యోగం నుంచి రిటైరైన వారిని గౌరవంగా సాగనంపాలని... స్టేషన్ లో సన్మానం చేసి, పోలీసు వాహనంలో వారిని ఇంటివద్ద దింపి రావాలని సూచించారు. పదవీ విరమణ చేసిన వారు పెన్షన్ కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండకూడదని చెప్పారు. రాయదుర్గం భూముల అమ్మకాలతో వచ్చిన డబ్బును పోలీస్ శాఖకే ఇస్తామని తెలిపారు. కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు రూ. 500 కోట్లు ఇస్తామని చెప్పారు.

More Telugu News