: ఒక బిడ్డే ఎక్కువ అని ఫీలవుతున్న చైనీయులు!

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాలో వృద్ధులు పెరిగిపోతున్నారన్న ఆందోళనతో రెండేళ్ల క్రితం పిల్లల్ని కనడంపై ఉన్న నిబంధనలు ఎత్తేసిన సంగతి తెలిసిందే. 'వృద్ధులు పెరిగిపోతున్నారు...ఇది చైనా భవిష్యత్ కు మంచిది కాదు, కనుక ఇద్దరేసి పిలల్ని కనాలని' పిలుపునిచ్చింది. అయితే దీనిని ఎవరూ పట్టించుకోవడం లేదు. రెండేళ్ల క్రితం చైనా ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో చైనా మహిళల మనసుల్లో భావన ఏంటి? అనేది తెలుసుకునేందుకు ఝాఫిన్‌.కామ్‌ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఉద్యోగినుల్లో పిల్లలు కనాలన్న ఆలోచనే లేదని గుర్తించింది. ఉద్యోగాలు చేస్తున్న మహిళలు తమ కెరీర్ కు పిల్లలు ఇబ్బందికరమని భావిస్తున్నారు.

 40 శాతం మంది చైనా ఉద్యోగినులు పిల్లలని కనాలని భావించడం లేదని తేలింది. అంతే కాదని ప్రతి ముగ్గురిలో ఇద్దరు రెండో బిడ్డను కనాలన్న ఆలోచనలో లేరని తేలింది. దీనికి కారణం... పని గంటలు, పెరుగుతున్న ఖర్చులు, ఖరీదైన విద్య, వైద్యంతో పాటు వారి పెంపకం కూడా భారమని భావిస్తున్నారని ఆ సంస్థ వెల్లడించింది. అంతే కాకుండా, 33 శాతం మహిళలు తల్లులైన తరువాత వారి వేతనంలో కోతలు పెరిగాయి. అలాగే, 36 శాతం మంది ప్రమోషన్లు కోల్పోయారని, పలువురు తక్కువ స్థాయి పదవికి డీమోట్‌ కూడా అవుతున్నారని, సంతానం విషయంలో విశాలంగా ఆలోచించకపోవడానికి, పిల్లల్ని పెంచడంలో వున్న ఇబ్బందులు కూడా ఒక కారణమని వ్యాపారులు తెలిపారు. ఈ నేపథ్యంలో చైనాలో యువకులు పెరగాలంటే...పిల్లల్ని కన్నవారికి, అవార్డులు, రివార్డులు,  సబ్సిడీలు ఇచ్చే పద్ధతిని తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు.

More Telugu News